హర్‌దీప్‌జీ..వెంటనే జోక్యం చేసుకోండి: గల్లా

గుంటూరు నగరంలోని మురుగునీటి వ్యవస్థ పనులు నిలిపివేశారని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ...

Published : 06 Nov 2020 01:09 IST

అమరావతి: గుంటూరు నగరంలోని మురుగునీటి వ్యవస్థ పనులు నిలిపివేశారని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీకి ఆయన లేఖ రాశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గుంటూరుకు రూ.500కోట్లు కేటాయించారని.. దాంతో పాటు అప్పటి తెదేపా ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసిందని చెప్పారు. 2019 జులై నాటికి షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ 50 శాతం పనులు పూర్తి చేసిందని లేఖలో వివరించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ పనులు నిలిపివేశారని.. ఈనెల 23 జిల్లా కలెక్టర్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయం పూర్తిగా తెలిసిందని జయదేవ్‌ పేర్కొన్నారు. పనులు చేపట్టిన నిర్మాణ సంస్థ కూడా గుంటూరు నుంచి వెళ్లిపోయినట్లు ఆయన చెప్పారు. కేంద్రం నిధులతో చేపడుతున్న ప్రాజెక్టును నిలిపివేయడంపై వెంటనే జోక్యం చేసుకోవాలని లేఖలో కేంద్రమంత్రిని జయదేవ్‌ కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని