‘శ్రీశైలం ఘటనపై సీబీఐ విచారణ కోరండి’

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యమని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. క్షేత్రస్థాయి సిబ్బంది రెండు రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్నారు...

Published : 23 Aug 2020 02:53 IST

గవర్నర్‌ తమిళిసైకు ఎంపీ రేవంత్‌  లేఖ

హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యమని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. క్షేత్రస్థాయి సిబ్బంది రెండు రోజుల క్రితమే హెచ్చరించినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు ఆయన లేఖ రాశారు. శ్రీశైలం ప్రమాదానికి మంత్రి జగదీశ్‌ రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు బాధ్యత వహించాలని.. వారిద్దరిపై చర్యలకు సీఎం కేసీఆర్‌ను ఆదేశించవలసిందిగా గవర్నర్‌ను కోరారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని.. ఘటనపై సీబీఐ విచారణ కోరాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. 

బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు తమను అడ్డుకున్నారని.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని ఆయన ఆక్షేపించారు. సీఎం కేసీఆర్‌ ఆధునిక నియంతగా మారారని రేవంత్‌ విమర్శించారు. కొవిడ్‌ విషయంలో జోక్యం చేసుకున్నట్టుగానే శ్రీశైలం అగ్ని ప్రమాద ఘటన విషయంలోనూ జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను ఆయన కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని