‘కాంగ్రెస్‌ వల్లే తేజస్వీ సీఎం కాలేకపోతున్నారు’

తాజాగా జరిగిన బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలహీనత కారణంగానే మహాకుటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్‌ సీఎం కాలేకపోతున్నారని ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ తారిక్‌ అన్వర్‌ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ బిహార్‌లో కాంగ్రెస్‌ వల్లే మహాకుటమి

Published : 12 Nov 2020 21:37 IST

ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ తారిక్‌ అన్వర్‌

పట్నా : తాజాగా జరిగిన బిహార్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బలహీనత కారణంగానే మహాకుటమి సీఎం అభ్యర్థి తేజస్వీయాదవ్‌ సీఎం కాలేకపోతున్నారని ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ తారిక్‌ అన్వర్‌ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ బిహార్‌లో కాంగ్రెస్‌ వల్లే మహాకుటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుందనే వాస్తవాన్ని ఒప్పుకుంటున్నట్లు వివరించారు. ప్రజల్లో నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకోవడంలో ఆర్జేడీ, వామపక్షాల ప్రదర్శనతో పోలిస్తే కాంగ్రెస్‌ రాణించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ కూడా ఆ పార్టీల లాగా సీట్లు సాధించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని వివరించారు. 

కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యంపై లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బిహార్‌లోని తమ అగ్రశ్రేణి నాయకులు, అభ్యర్థులు, జిల్లా కమిటీలలో చర్చించి ఓటమికి గల కారణాలను పార్టీ అధిష్ఠానానికి తెలియజేస్తామని వివరించారు. ఇదిలా ఉంటే 2015 బిహార్‌ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ 27 సీట్లు సాధించింది. ఈ సారి ఆర్జేడీ, వామపక్షాలతో కలిసి మహాకుటమిలో భాగమైన కాంగ్రెస్‌ ఏకంగా 70 సీట్లలో తమ అభ్యర్థులను ఉంచింది. కాగా 19 సీట్లకే కాంగ్రెస్‌ పరిమితమైంది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని