Published : 26/10/2020 13:56 IST

అజిత్‌ పవార్‌కు కొవిడ్‌ పాజిటివ్‌

ముంబయి: కొవిడ్‌-19 బారిన పడ్డ ప్రముఖుల జాబితాలోకి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ చేరారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తనకు ఏ విధమైన లక్షణాలు లేనప్పటికీ.. వైద్యనిపుణుల సలహా మేరకు బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చేరినట్టు అజిత్‌ పవార్‌ సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. కొద్ది రోజుల విశ్రాంతి అనంతరం తాను ప్రజల మధ్యకు వస్తానని ఆయన కార్యకర్తలనుద్దేశించి అన్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్‌, ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌లకు కరోనా వ్యాధి సోకినట్టు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే.


Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని