కమల్‌ పార్టీకి ఎదురుదెబ్బ

నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం భాజపాలో చేరారు...

Published : 25 Dec 2020 18:53 IST

చెన్నై: తమిళనాడులో పూర్తిస్థాయి రాజకీయ కార్యకలాపాలకు సిద్ధమవుతున్న వేళ నటుడు కమల్‌హాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యమ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం భాజపాలో చేరారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ సమక్షంలో చెన్నైలో భాజపా కండువా కప్పుకొన్నారు. మక్కల్‌ నీది మయ్యమ్‌ కోర్‌ కమిటీ సభ్యుడిగా కూడా వ్యవహరిస్తున్న అరుణాచలం తమిళనాడులో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో ఐదు నెలల్లో జరుగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసం కమల్‌హాసన్‌ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా కీలక నేత భాజపాలో చేరడం ఆ పార్టీ నేతలను షాక్‌కు గురిచేసింది.

ఇవీ చదవండి...

నితీశ్‌కి షాకిచ్చిన భాజపా

బండి సంజయ్‌ పర్యటనలో ఉద్రిక్తత
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు