
అమిత్ షా చెప్పినవన్నీ అసత్య గణాంకాలే!
విరుచుకుపడ్డ మమతా బెనర్జీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర పరిస్థితిపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడినవన్నీ తప్పులేనని ఆ ఆరోపణలను రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. బెంగాల్ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధిపై అమిత్ షా ఇచ్చిన గణాంకాలు అబద్దాల పుట్ట అని విరుచుకుపడ్డారు. హోంశాఖ మంత్రిగా ఉన్న మీకు సరైన వివరాలను నిర్ధారణ చేసుకోకుండా మీ పార్టీ నేతలు ఇచ్చిన అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని అమిత్‌షాకు సూచించారు. పరిశ్రమలు, రోడ్లపై ఆయన చేసిన ఆరోపణలు కూడా అసత్యమన్నారు. వీటికి సంబంధించి పశ్చిమ బెంగాల్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వ నివేదికలే ఆధారమన్నారు. షా చేసిన అసత్య గణాంకాలపై పూర్తి వివరాలను మంగళవారం వెల్లడిస్తానని మమతా బెనర్జీ తెలిపారు.
అవినీతి, దోపిడి విషయాల్లో తప్ప పశ్చిమ బెంగాల్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అన్నింటిలో వెనుకంజలో ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఇక బీర్భమ్ జిల్లాలో ఈ నెల 28వ తేదీన అధికారిక కార్యక్రమంలో పాల్గొంటానని, మరుసటి రోజు రోడ్ షో నిర్వహిస్తానని మమతా బెనర్జీ వెల్లడించారు.
ఇదిలాఉంటే, మార్పు కోసం బెంగాల్ ప్రజలు ఆరాటపడుతున్నారని.. వారు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. భాజపాకు అధికారం ఇస్తే, బంగారు బెంగాల్ నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ.. అక్కడ పాగా వేసేందుకు భాజపా ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా అమిత్‌షా గడిచిన రెండు నెలల్లో రెండుసార్లు బెంగాల్ పర్యటన చేశారు. ఇక భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ మధ్యే పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.
ఇవీ చదవండి..
బెంగాల్ ఎన్నికలపై భాజపాకు పీకే సవాల్
భాజపా ఎంపీ భార్య దీదీ పార్టీలోకి!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra Crisis: ‘శివసైనికులు గనక బయటకొస్తే..’ సంజయ్ రౌత్ ఘాటు హెచ్చరిక
-
India News
Droupadi Murmu: ద్రౌపదీ ముర్ముకు మాయావతి మద్దతు
-
Movies News
Nikhil: లైవ్ ఈవెంట్లో అభిమానికి నిఖిల్ సూపర్ గిఫ్ట్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!
-
India News
Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19 ఏళ్లు వేదన అనుభవించారు..!
-
Politics News
Maharashtra Political Crisis: కొనసాగుతోన్న ‘మహా’ అనిశ్చితి.. శిందే కంచుకోటలో 144 సెక్షన్
-
Movies News
Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్