Published : 24/12/2020 00:43 IST

రైతులకు మమతా బెనర్జీ ఫోన్‌

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ఆందోళన కొనసాగిస్తున్న రైతులతో పశ్చిమబెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌  మమతా బెనర్జీ ఫోన్‌లో మాట్లాడారు. వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. సింఘు సరిహద్దు వద్ద పోరాటం కొనసాగిస్తున్న రైతులను తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎంపీల బృందం కలిసింది. డెరెక్‌ ఓబ్రెయిన్‌, శతాబ్ది రాయ్‌, ప్రసూన్‌ బెనర్జీ, ప్రతిమ మండల్‌, మహ్మద్‌ నదీముల్‌ హక్‌ రైతులను కలిసి వారు చేపట్టిన రిలేనిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ రైతులతో ఫోన్‌లో మాట్లాడారు. వారికి తమ పార్టీ పూర్తిగా సంఘీభావం తెలుపుతుందని హామీ ఇచ్చారు. అయితే, కొందరు రైతులు ఆమెను సింఘు సరిహద్దు వద్దకు రావాలని కోరినట్టు సమాచారం. 

రైతులను అవమానించడం ఆపండి: అఖిలేశ్‌

రైతులను అవమానించడం భాజపా ఆపాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ కోరారు. మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌ జయంతి సందర్భంగా (జాతీయ రైతు దినోత్సవం) ఆయనకు నివాళులర్పించిన సందర్భంగా అఖిలేశ్‌ ట్వీట్‌ చేశారు. రైతు దినోత్సవం జరుపుకోవాల్సిన అన్నదాతలు భాజపా పాలనలో రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నారన్నారు. రైతులు దేశానికి గర్వకారణమని, వారిని అవమానించడం ఆపాలన్నారు. 

ఇదీ చదవండి..

మడమతిప్పని ఉద్యమ పోరు

 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని