తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త‌ ఇన్‌ఛార్జ్‌

పార్టీలో కీలక మార్పులకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది.

Published : 12 Sep 2020 01:31 IST

హైదరాబాద్‌: పార్టీలో కీలక మార్పులకు కాంగ్రెస్‌ శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీలకు కొత్త వారిని ఇన్‌ఛార్జులుగా నియమించింది. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆర్సీ కుంతియా స్థానంలో తమిళనాడులోని విరుదునగర్‌ ఎంపీ మాణికం ఠాగూర్‌ను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఊమెన్‌చాందీనే కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్‌కు సీడబ్ల్యూసీలో స్థానం కల్పించారు.

మాణికం ఠాగూర్ నియామకం పట్ల పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్‌లలో సంస్థాగతంగా పనిచేసిన అనుభవం ఉన్న యువ నాయకుడు ఠాగూర్‌ను పార్టీ ఇన్‌ఛార్జిగా నియమించడం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి..

సీడబ్ల్యూసీ ప్రక్షాళన.. ఆజాద్‌కు షాక్‌!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని