అవసరమైతే చిరాగ్ సహకారం : తేజస్వి

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత అవసరమైతే తాము చిరాగ్ పాసవాన్ సహకారం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు.

Published : 20 Oct 2020 19:55 IST

ఆ వార్తలను కొట్టిపారేసిన ఎల్‌జేపీ

పట్నా: ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత అవసరమైతే తాము చిరాగ్ పాసవాన్ సహకారం తీసుకుంటామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ ప్రిన్స్‌ రాజ్ మంగళవారం ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవీ నివాసానికి వెళ్లిన నేపథ్యంలో తేజస్వి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

‘ఎన్నికల ఫలితాల తరవాత మెజార్టీ కొరవడితే, ఆర్జేడీ చిరాగ్‌ పాసవాన్‌ పార్టీ అయిన ఎల్‌జేపీ సహకారం తీసుకోవచ్చు’ అని తేజస్వి వ్యాఖ్యానించారు. ఈ ఊహాగానాలను ఎల్‌జేపీ తోసిపుచ్చింది. దివంగత నేత రాంవిలాస్ పాసవాన్‌కు నివాళులు అర్పించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మాత్రమే ఎల్‌జేపీ నేత అక్కడికి వెళ్లారని, దానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేసింది.

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి నుంచి వైదొలిగి, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ఇదివరకే చిరాగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, మూడు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్‌ 28 నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 10న ఫలితాలు వెల్లడికానున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని