Published : 05/10/2020 01:18 IST

వారు వ్యవసాయ బిల్లును వ్యతిరేకించడం విచిత్రం!

పనాజి: వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు మధ్యవర్తుల కోసం మధ్యవర్తుల్లా వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ విమర్శించారు. వ్యవసాయ బిల్లులపై అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా ఆయన గోవాలో రెండో రోజూ పర్యటించారు. ఈ సందర్భంగా జావడేకర్‌ మాట్లాడుతూ మధ్యవర్తులు(దళారుల) వల్ల రైతులు గతంలో తీవ్రంగా నష్టపోయేవారన్నారు. దళారుల వ్యవస్థకు చరమగీతం పలుకుతూ రైతులకు మేలు జరగాలని కేంద్రం ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినట్లు ఆయన అన్నారు.

కాంగ్రెస్‌, ఎన్సీపీ కలిసి వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన తెలపటం విచిత్రంగా ఉందన్నారు. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యల గురించి జావడేకర్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుల మాదిరిగానే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలని మన్మోహన్‌ సింగ్‌ ఆనాడు అన్నారని వివరించారు. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకుందని ఎద్దేవా చేశారు. ఈ వ్యవసాయ బిల్లుల వల్ల మార్కెట్‌ కమిటీలను తీసేస్తామని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించే విధానం రద్దవుతుందని ప్రతిపక్షాలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని