తిరుపతి ఉపఎన్నికే రెఫరెండం: పెద్దిరెడ్డి

తిరుపతి ఉపఎన్నికను తెదేపా రెఫరెండంగా తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ విసిరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో జరిగే ఉపఎన్నికలో

Published : 19 Dec 2020 01:18 IST

అమరావతి: తిరుపతి ఉపఎన్నికను తెదేపా రెఫరెండంగా తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ విసిరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో జరిగే ఉపఎన్నికలో తెదేపా గెలిచే పరిస్థితి లేదన్నారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుపతిలో ఓడిపోతే చంద్రబాబు రాజకీయ సన్యాసానికి సిద్ధపడాలన్నారు. మూడు రాజధానులు తమ ప్రభుత్వ విధానమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఇంతకంటే రెఫరెండం ఏముందని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నిక ఫలితం వచ్చాక తెదేపా ఏ స్థానంలో ఉంటుందో తేలుతుందన్నారు.

మరోవైపు అమరావతి రెఫరెండంపై అధికార ప్రతిపక్ష నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. జనభేరి ఉద్యమ వేదికగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్పందించారు. తెదేపా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి అమరావతి అంశంపై ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. దీనికి ప్రతిగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ తాను సిద్ధమంటూ ప్రతిసవాల్‌ విసిరారు. కృష్ణా జిల్లాలో మొత్తం ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని