బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణస్వీకారం

బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ ఏడోసారి ప్రమాణస్వీకారం చేశారు

Updated : 16 Nov 2020 16:57 IST

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నీతీశ్‌ కుమార్‌ ఏడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఫగు చౌహాన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. నితీశ్‌తోపాటు మరో 12 మంది కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో భాజపా శాసనసభాపక్ష నేత తార్‌కిషోర్‌ ప్రసాద్‌ మరో సీనియర్‌ భాజపా నేత రేణుదేవి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రేణుదేవి భాజపా తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటివరకు నీతీశ్‌ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సుశీల్‌ కుమార్‌ మోదీ స్థానంలో తార్‌కిషోర్‌ ప్రసాద్‌ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. మరోవైపు సుశీల్‌ కుమార్‌ మోదీని మాత్రం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆర్జేడీ సభ్యులు గైర్హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని