అణచివేయాలని ప్రయత్నిస్తే ఊరుకోం: ఎంపీ అర్వింద్

గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీతోనే భాజపాకు పోటీ అని.. తెరాసతో కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంటే భాజపా ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో..

Published : 20 Nov 2020 01:53 IST

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీతోనే భాజపాకు పోటీ అని.. తెరాసతో కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇస్తుంటే భాజపా ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెరాసపై విమర్శనాస్త్రాలు సంధించారు. మజ్లిస్‌తో దోస్తీ చేస్తున్న సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని ముస్లింలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై యుద్ధం ప్రకటించాలాంటే ముందుగా ఫామ్ హౌజ్ నుంచి కేసీఆర్ బయటకు రావాలని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో తెరాస కనుసన్నల్లో నడుస్తోందని.. ఈ విషయంలో కొంతమంది అధికారులపై ఫిర్యాదు చేయబోతున్నామని ఈ సందర్భంగా అర్వింద్‌ చెప్పారు. జీహెచ్ఎంసీ కమిషనర్లను బదిలీ చేయమని లేఖ రాస్తామని అన్నారు. ఎన్నికల్లో భాజపాను అణచివేయాలని పోలీసులు ప్రయత్నిస్తే ఊరుకోమని అర్వింద్‌ హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని