
‘కాంగ్రెస్‌ను ఎవరూ రక్షించలేరు..’
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్
దిల్లీ: కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై భాజపా నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింథియా గళం విప్పినప్పుడు ఆయన భాజపాతో కుమ్మక్కయ్యారన్నారని, ఇప్పుడు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ లాంటి నేతలు పూర్తి కాలం అధ్యక్షుడి నియామకం కోసం డిమాండ్ చేస్తుంటే వాళ్లను కూడా అలానే ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాంటి పార్టీని ఎవరూ కాపాడలేరన్నారు.
కాంగ్రెస్ నాయకత్వంపై రోజురోజుకీ విశ్వాసం సన్నగిల్లిపోతోందని గ్వాలియర్‌లో నిన్న సీఎం చౌహాన్ అన్నారు. ఇప్పటికే యువ నేత రాహుల్ అధ్యక్ష పదవి నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. చాలా మంది నాయకులు అనేక ప్రశ్నలు లేవనెత్తారని, పార్టీలో నాయకత్వం లేనందువల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అస్తిత్వ సంక్షోభం ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు.
అస్తిత్వంలో నెహ్రూ-గాంధీ కుటుంబం: ఉమాభారతి
నెహ్రూ-గాంధీ కుటుంబ అస్తిత్వం సంక్షోభంలో పడిందని భాజపా సీనియర్ నాయకురాలు ఉమా భారతి అన్నారు. వారి రాజకీయ ఆధిపత్యానికి తెరపడినట్టేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పని అయిపోయిందని, అందువల్ల ఏ పదవిలో ఎవరు ఉంటారనేది ఇప్పుడు కష్టమేననన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.