గజేంద్రసింగ్‌కు రాజస్థాన్‌ పోలీసులనోటీసులు!

రాజస్థాన్‌ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. ఆడియో టేపుల విషయంలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌కు రాజస్థాన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌(ఎస్‌వోజీ) పోలీసులు నోటీసులు జారీ చేశారు.........

Published : 20 Jul 2020 13:27 IST

జైపుర్‌: రాజస్థాన్‌ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారుతున్నాయి. ఆడియో టేపుల విషయంలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌కు రాజస్థాన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌(ఎస్‌వోజీ) పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీటిని ఆయన వ్యక్తిగత కార్యదర్శికి పంపినట్లు ఎస్‌వోజీ ఏడీజీ తెలిపారు. కాంగ్రెస్‌ సర్కారును కూల్చివేయడానికి శాసనసభ్యులను ప్రలోభపెట్టే సంభాషణలుగా చెబుతున్న ఆడియో టేపులపై కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌వోజీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. గజేంద్ర షెకావత్‌తో పాటు కాంగ్రెస్‌ బహిష్కృత ఎమ్మెల్యే భన్వర్‌లాల్‌ శర్మ, ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్న సంజయ్‌ జైన్‌ పేర్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

సంజయ్‌ జైన్‌ను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు పలు దఫాలు విచారించారు. తాజాగా విచారణకు హాజరు కావాలంటూ గజేంద్ర సింగ్‌కు నోటీసులు పంపారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే స్పందించిన ఆయన.. ఆ ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని తెలిపారు. ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే కాంగ్రెస్‌ తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని