హాథ్రస్‌ ఘటనపై మోదీ మాట్లాడరేం..?: రాహుల్‌

హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. 19ఏళ్ల యువతి మృగాళ్ల అకృత్యానికి బలైతే దేశ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా

Published : 06 Oct 2020 14:21 IST

పాటియాలా: హాథ్రస్‌ ఘటన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. 19ఏళ్ల యువతి మృగాళ్ల అకృత్యానికి బలైతే దేశ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని దుయ్యబట్టారు. నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్‌లో ‘ఖేటీ బచావో యాత్ర’ నిర్వహిస్తున్న రాహుల్‌.. మంగళవారం పాటియాలాలో ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాథ్రస్‌ ఘటన గురించి ప్రస్తావించారు. 

‘ఓ యువతి అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న వారిపై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేంటని ప్రశ్నిస్తుంటే కుట్ర చేస్తున్నామని అంటున్నారు. హాథ్రస్‌ ఘటనను యోగీజీ అంతర్జాతీయ కుట్రలా చూస్తున్నారు. అది ఆయన అభిప్రాయం. కానీ నా వరకు అది విషాదకర ఘటన. అందుకే వారిని కలిసేందుకు వెళ్లా. వారు ఒంటరి కాదు అని చెప్పడానికి వెళ్లా’ అని రాహుల్‌ అన్నారు. 

చీకటి చట్టాలపైనే మా పోరాటం..

ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టంపై కూడా రాహుల్‌ మాట్లాడారు. కరోనాతో కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం.. ఇలాంటి చట్టాలను తీసుకొచ్చి వారిని మరింత ఇబ్బందుల్లో పడేస్తోందన్నారు. కొత్త చట్టం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఇలాంటి చీకటి చట్టాలపై పోరాటం చేసేందుకే ఖేటీ బచావో యాత్ర చేపట్టామని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని