రక్షణ విషయంలో రాజీపడొద్దు: జగన్‌

మహిళలు, వృద్ధులు, పిల్లల రక్షణ విషయంలో  పోలీసులు ఏమాత్రం రాజీపడొద్దని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల ..

Updated : 21 Oct 2020 11:28 IST

విజయవాడ: మహిళలు, వృద్ధులు, పిల్లల రక్షణ విషయంలో  పోలీసులు ఏమాత్రం రాజీపడొద్దని ఏపీ సీఎం జగన్‌ స్పష్టం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో  సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరులైన పోలీసులను దేశమంతా స్మరించుకుంటోందన్నారు. ప్రతి పోలీసు కుటుంబానికి సమాజం జేజేలు పలుకుతోందన్నారు. బడుగు, బలహీనవర్గాలపై కులపరమైన దాడులు జరిగితే ఉపేక్షించవద్దని సూచించారు. రాష్ట్రంలో 18 దిశ పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేసి మహిళలకే బాధ్యతలు అప్పగించామన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరుల వివరాలతో కూడిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. 

హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ..  కరోనా కాటుకు కొందరు పోలీసులు అమరులయ్యారని, ఆయా కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పోలీసు ఉద్యోగుల సమస్యలపై సీఎంకు  పూర్తి అవగాహన ఉందన్నారు. డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ మాట్లాడుతూ... సవాళ్లను ఎదుర్కోవడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారని గుర్తు చేశారు.

మరిన్ని చిత్రాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని