
దుబ్బాకలో పోలింగ్..గతం కంటే తక్కువే..
ఇంటర్నెట్ డెస్క్: బిహార్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరోనా భయం వెంటాడుతున్న నేపథ్యంలో ఈసీ అన్ని ఏర్పాట్లు చేయడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బిహార్‌లోని రెండో దశ ఎన్నికలు 94 స్థానాల్లో జరగ్గా.. 53.51శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తెలంగాణలోని దుబ్బాకలో 82.61% పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఇది తక్కువే. ఆ ఎన్నికల్లో దుబ్బాకలో 86.24% ఓట్లు పోలయ్యాయి.
తాజాగా ఛత్తీస్‌గఢ్ 71.99%, గుజరాత్ 57.98%, హరియాణా 68%, జార్ఖండ్ 62.51%, కర్ణాటక 51.3%, మధ్యప్రదేశ్ 66.37%, నాగాలాండ్ 83.69%, ఒడిశా 68.08%, యూపీ 51.57% చొప్పున పోలింగ్ నమోదైనట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ నెల 7న బిహార్ తుది విడత ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.