వాళ్ల జేబుల్నే కేంద్రం నింపుతోంది: రాహుల్‌

నరేంద్ర మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో విమర్శలు కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 94వ స్థానంలో నిలవడంపై ట్విటర్‌లో మండిపడ్డారు. తమ ‘ప్రత్యేక మిత్రుల’ జేబులను...........

Updated : 17 Oct 2020 15:46 IST

దిల్లీ:  నరేంద్ర మోదీ సర్కార్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తనదైన శైలిలో విమర్శలు కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ 94వ స్థానంలో నిలవడంపై ట్విటర్‌లో మండిపడ్డారు. తమ ‘ప్రత్యేక మిత్రుల’ జేబులను నింపడంలో కేంద్రం తీరికలేకుండా ఉందని, అందుకే దేశంలోని పేదలు ఆకలితో అలమటిస్తున్నారని ఆరోపించారు. అంతర్జాతీయ ఆకలి సూచీ -2020 నివేదికలో 107 దేశాలకు గాను భారత్‌ 94వ స్థానంలో నిలవవడాన్ని ప్రస్తావించిన రాహుల్‌.. పొరుగుదేశాలైన పాకిస్థాన్‌ (88), నేపాల్‌ (73), బంగ్లాదేశ్‌ (75)లు భారత్‌ కన్నా మెరుగైన స్థానాల్లో ఉన్నాయని పేర్కొంటూ అందుకు సంబంధించిన గ్రాఫ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అంతర్జాతీయ ఆకలి సూచీ నివేదిక ప్రకారం భారత్‌ తర్వాత స్థానాల్లో రువాండా ((97), నైజీరియా (98), ఆఫ్గనిస్థాన్‌ 99), లిబియా (102), మొజాంబిక్‌ (103), చద్‌ (107) స్థానాల్లో ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని