ఆ విషయంలో మనకంటే పాక్‌ నయం: రాహుల్ 

ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 10.3 శాతం కుచించుకుపోవచ్చన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్రంపై విరుచుకుపడ్డారు.

Published : 16 Oct 2020 13:54 IST

ఐఎంఎఫ్‌ అంచనాలను ప్రస్తావిస్తూ విమర్శలు

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 10.3 శాతం కుచించుకుపోవచ్చన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్రంపై విరుచుకుపడ్డారు. మనకంటే పాకిస్థాన్‌ కరోనాను గొప్పగా కట్టడి చేసిందని, ఇది భాజపా ప్రభుత్వం సాధించిన ఘన విజయమంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా 2020-21 సంవత్సరానికి బంగ్లాదేశ్‌, మయన్మార్, నేపాల్, చైనా, భూటాన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌‌, భారత దేశాల ఐఎంఎఫ్ వృద్ధి అంచనాల ఛార్ట్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు.‘ఇది భాజపా ప్రభుత్వం సాధించిన మరో ఘన విజయం. చివరికి భారత్‌ కంటే పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ కరోనాను గొప్పగా కట్టడి చేశాయి’ అంటూ దుయ్యబట్టారు. 

తలసరి జీడీపీలో భారత్‌ బంగ్లాదేశ్‌ దిగువకు చేరుతుందంటూ రెండు రోజుల క్రితం ఐఎంఎఫ్ నివేదిక వెలువడిన వెంటనే రాహుల్ స్పందిస్తూ.. ‘భాజపా ఆరు సంవత్సరాల విద్వేష జాతీయవాదానికి లభించిన ఘన విజయం ఇది. భారత దేశాన్ని బంగ్లాదేశ్‌ దాటనుంది’ అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. 

ఇవీ చదవండి:

తలసరి జీడీపీలో బంగ్లాదేశ్‌ దిగువకు భారత్‌!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని