రైతులపై రాహుల్‌ది మొసలి కన్నీరే!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై అబద్ధాలతో ఆయన రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన .....

Published : 26 Dec 2020 02:23 IST

అమేఠీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఫైర్‌

అమేఠీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై అబద్ధాలతో ఆయన రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన అమేఠీలో నిర్వహించిన రైతుల ర్యాలీలో స్మృతి ఇరానీ మాట్లాడారు. రాహుల్‌ గాంధీ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ వారిని తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. రైతు సమస్యలపై చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఇక్కడి రైతుల మధ్యకు వస్తే.. ఆయన చేసిన పాపాలను బహిర్గతం చేస్తానని వ్యాఖ్యానించారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింది రూ.18వేల కోట్లను దేశ వ్యాప్తంగా 9కోట్లమంది రైతుల ఖాతాల్లో వేసే కార్యక్రమంలో భాగంగా సింఘ్‌పూర్‌ బ్లాక్‌లోని తిలోయ్‌లో నిర్వహించిన ర్యాలీలో స్మృతి మాట్లాడారు. 

గత లోక్‌సభ ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన రాహుల్‌.. ఇప్పుడు రైతుల పట్ల సానుభూతి చూపుతున్నారన్నారు. తాను అమేఠీకి రాకముందు ఎలాంటి అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసునన్నారు. రాహుల్‌ గాంధీ కుటుంబం అమేఠీని, ఇక్కడి రైతులను అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచారని ధ్వజమెత్తారు. ప్రజలను తప్పుదోవపట్టించి దిల్లీలో కూర్చొని అధికార ఫలాలను అనుభవించారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచినా అమేఠీ అభివృద్ధి గురించి ఆలోచించలేదని ఆరోపించారు. 

ఇదీ చదవండి

ఆందోళన ఆపి.. చర్చలకు రండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని