ప్రజాస్వామ్యం కోసం గళమెత్తండి: రాహుల్‌

రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితికి భాజపానే కారణమని కాంగ్రెస్‌ పార్టీ అరోపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీని కూలదోసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తోందని ఆ పార్టీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గలమెత్తాలని ఆ పార్టీ.....

Published : 27 Jul 2020 01:38 IST

దిల్లీ: రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితికి భాజపానే కారణమని కాంగ్రెస్‌ పార్టీ అరోపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీని కూలదోసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తోందని ఆ పార్టీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గళమెత్తాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

దేశమంతా కరోనాపై పోరాడుతుంటే.. భాజపా ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో అదే చేశారు.. ఇప్పుడు రాజస్థాన్‌లో అదే చేస్తున్నారని విమర్శించారు. రాజస్థాన్‌ అసెంబ్లీని తక్షణమే సమావేశ పరచాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు #SpeakUpForDemocracy పేరిట హ్యాష్‌ట్యాగ్‌  ఏర్పాటు చేసి.. ఈ పోరులో భాగస్వాములు అవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు రాష్ట్రపతి భవన్‌ ఎదుట ఆందోళన చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. రాజస్థాన్‌ అంశంపై దేశవ్యాప్త ఆందోళనలకూ సిద్ధమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని