రాజస్థాన్ పాలిటిక్స్‌: కొనసాగుతున్న ఉత్కంఠ!

రాజస్థాన్‌ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. స్పీకర్‌ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ రెబల్‌ నేత సచిన్‌ పైలట్‌కు ఇచ్చిన గ‌డువు ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ సమయంలోనే సచిన్‌ వేసిన పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టులో నేడు మరోసారి విచారణ కొనసాగుతోంది. ఈరోజు విచారణ పూర్తి చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి ఇప్పటికే ప్రకటించారు. దీంతో హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

Updated : 21 Jul 2020 13:24 IST

సచిన్‌ పైలట్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ముఖ్యమంత్రి అధ్యక్షతన మరోసారి సమావేశమైన సీఎల్పీ

జైపూర్‌: రాజస్థాన్‌ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. స్పీకర్‌ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ రెబల్‌ నేత సచిన్‌ పైలట్‌కు ఇచ్చిన గ‌డువు ఈ సాయంత్రంతో ముగియనుంది. ఈ సమయంలోనే సచిన్‌ వేసిన పిటిషన్‌పై రాజస్థాన్‌ హైకోర్టులో నేడు మరోసారి విచారణ కొనసాగుతోంది. ఈరోజు విచారణ పూర్తి చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతి ఇప్పటికే ప్రకటించారు. దీంతో హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

ఇదే సమయంలో, ఇరువర్గాల క్యాంపు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి మద్దతుదారులు దాదాపు 100మంది ఎమ్మెల్యేలు గడిచిన వారం రోజులుగా జైపూర్‌లోని ఫెయిర్‌మోంట్‌ హోటల్‌లోనే మకాం వేసివున్నారు. తాజాగా అక్కడే ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ అధ్యక్షతన కాంగ్రెస్‌ శాసనసభ పక్ష సమావేశం(సీఎల్పీ) జరుగుతోంది. ఈవారం రోజుల్లో సీఎల్పీ సమావేశం కావడం ఇది మూడోసారి. అయితే ఈ సమావేశానికి రెబల్‌ నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు నిన్నటివరకూ ఉంచనా వేశారు. కానీ, తాజాగా రెబల్‌ నేత సచిన్‌ పైలట్‌ ఒక దద్దమ్మ అంటూ ముఖ్యమంత్రి గహ్లోత్‌  చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతో పార్టీకి సచిన్‌ మరింత దూరమైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సచిన్‌ వర్గం కూడా హైకోర్టు తీర్పుపైనే ఆశలు పెట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని