రజనీకాంత్‌ కీలక భేటీ ప్రారంభం

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం రజనీ మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో కీలకంగా భేటీ అయ్యారు. స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో

Updated : 30 Nov 2020 11:05 IST

చెన్నై: తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ‘రజనీ మక్కళ్‌ మండ్రం’ నిర్వాహకులతో కీలకంగా భేటీ అయ్యారు. స్థానిక రాఘవేంద్ర కల్యాణ మండపంలో మక్కళ్‌ మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ సమావేశమయ్యారు. రాజకీయ అరంగేట్రంపై చర్చించడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది. అంతకుముందు రజనీకాంత్ నివాసం ఎదుట అభిమానుల పోటెత్తారు. రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు.   

తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రజనీ పార్టీ నిర్వాహకులతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయాల్లోకి వచ్చే విషయమై డిసెంబరు 12న ఆయన పుట్టినరోజు నాడు కీలక ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం ఊపందుకుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన కచ్చితంగా పోటీ చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకోసమే తాజా సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. 

రజనీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే పలుమార్లు ప్రచారం జరిగింది. తాను రాజకీయాల్లోకి వస్తానంటూ మూడేళ్ల క్రితమే ప్రకటించినా.. ఇప్పటివరకు పార్టీ ప్రారంభించలేదు. అటు క్రియాశీల రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అయితే అదే సమయంలో మక్కళ్‌ మండ్రం బలోపేతానికి చర్యలు చేపట్టారు. జిల్లాలవారీగా నిర్వాహకులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడైనా పార్టీ గురించి ప్రకటిస్తారో లేదో చూడాలి..!

ఇదీ చదవండి.. 

అందరి చూపు తలైవా వైపు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని