సచిన్‌ పైలట్‌ పిటిషన్‌: విచారణ ప్రారంభం!

జైపూర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులను సవాలుచేస్తూ సచిన్‌ పైలట్‌తోపాటు మరో 18మంది రెబల్‌ ఎమ్మెల్యేలు హైకోర్టులలో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర హైకోర్టు నేడు మరోసారి విచారణ ప్రారంభించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతీ, ప్రకాశ్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక రాజస్థాన్‌ స్పీకర్‌ తరపున అభిషేక్‌ సింగ్వీ వాదనలు వినిపిస్తున్నారు.

Updated : 20 Jul 2020 11:47 IST

జైపూర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులను సవాలుచేస్తూ సచిన్‌ పైలట్‌తోపాటు మరో 18మంది రెబల్‌ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర హైకోర్టు నేడు మరోసారి విచారణ ప్రారంభించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఇంద్రజిత్‌ మహంతీ, ప్రకాశ్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇక రాజస్థాన్‌ స్పీకర్‌ తరఫున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ బలనిరూపణకు సిద్ధమైనట్లు సమాచారం. త్వరలోనే అసెంబ్లీని సమావేశపరిచి తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేడు హైకోర్టు తీర్పు రాగానే తన వ్యూహాన్ని అమలుచేయనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని