పవార్ యూపీఏ ఛైర్మనైతే సంతోషమే: రౌత్‌

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌ను యూపీఏ ఛైర్మన్‌గా చూడటం తమకు సంతోషమేనని శివసేన వెల్లడించింది.

Published : 12 Dec 2020 01:23 IST

ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్‌ను యూపీఏ ఛైర్మన్‌గా చూడటం తమకు సంతోషమేనని శివసేన వెల్లడించింది. ప్రస్తుతం కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో, ప్రతిపక్షాలు కలిసినడవాల్సి ఉందని వ్యాఖ్యానించింది. ‘పవార్‌ సర్ యూపీఏ ఛైర్మన్ అయితే, మేము సంతోషిస్తాం. కానీ, ఆయన వ్యక్తిగతంగా దాన్ని తిరస్కరించారని నేను విన్నాను. అధికారికంగా అలాంటి ప్రతిపాదన వస్తే మేం మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో, యూపీఏను బలోపేతం చేయడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి రావాల్సి ఉంది’ అని శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. 

అయితే, శరద్ పవార్ యూపీఏకు నాయకత్వం వహిస్తారని వస్తోన్న వార్తలు నిరాధారమైనవని ఎన్‌సీపీ ప్రతినిధి మహేశ్ తపసే మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతోన్న రైతుల ఆందోళన నుంచి దృష్టి మళ్లించేందుకు స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి వార్తలు వెలువడుతున్నాయని మండిపడ్డారు. 

ఇవీ చదవండి:

భాజపా..హిట్లర్ పార్టీ: మమత

ఆరేళ్లలో తెలంగాణకు కేసీఆర్ చేసిందేమీ లేదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని