‘సోనియా గాంధీకి ఆ సలహా ఎవరిచ్చారో!’ 

కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీని మరచిపోయి నూతన వ్యవసాయ చట్టాలపై సోనియాగాంధీ విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టే చట్టాలను తీసుకురావాలని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు

Published : 30 Sep 2020 01:35 IST

దిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీని మరచిపోయి నూతన వ్యవసాయ చట్టాలపై సోనియాగాంధీ విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తిప్పికొట్టే చట్టాలను తీసుకురావాలని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు సోనియా గాంధీ పిలునిచ్చిన నేపథ్యంలో నిర్మల ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ చట్టాన్ని రద్దు చేస్తామనే హామీ ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. వ్యవసాయ చట్టంపై కాంగ్రెస్‌ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో తప్పుడు హామీ ఏమైనా ఇచ్చిందా అని ఆమె ఆనుమానం వ్యక్తం చేశారు. కేవలం ప్రజల్ని రెచ్చగొట్టేలనే ఉద్దేశంతోనే కేంద్ర చట్టాల్ని తిప్పికొట్టే చట్టాల్ని తయారు చేయమని సోనియా రాష్ట్రాల్ని కోరుతున్నారని నిర్మల ఆక్షేపించారు. ‘2019 కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని 7వ సెక్షన్‌ 9వ పేజీ ప్రకారం: వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ చట్టాన్ని కాంగ్రెస్‌ రద్దు చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య నిర్వహణ, ఎగుమతులు, అంతరాష్ట్ర వాణిజ్యంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని’ పేర్కొనట్లు నిర్మల ట్వీట్‌ చేశారు. ‘అధికారం చేజిక్కించుకొనేందుకు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అబద్ధపు హామీ ఇచ్చిందా? లేక ప్రజలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే ఇప్పడు కేంద్ర చట్టాల్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రాలను చట్టాలు చేయమని చెబుతున్నారా? ఈ సలహా వారి అధ్యక్షురాలి (సోనియాగాంధీ)కి ఎవరిచ్చారోగానీ ఆశ్చర్యంగా ఉందని’ నిర్మల అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని