వారికి ఇవ్వాల్సింది సాయం.. రుణం కాదు

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులు, చిన్న వర్తకులకు  ప్రత్యేక సహాయ ప్యాకేజీ ఇవ్వాలి తప్ప రుణం కాదని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా.........

Published : 28 Oct 2020 00:43 IST

దిల్లీ: కరోనాతో విధించిన లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారులు, చిన్న వర్తకులకు ప్రత్యేక సహాయ ప్యాకేజీ ఇవ్వాలి తప్ప రుణం కాదని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటానికి ముందే ఆమె ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌తో వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారికి ఇల్లు గడవడమే కష్టంగా మారిందని ప్రియాంక ఆవేదన వ్యక్తంచేశారు. అందువల్ల వారికి కావాల్సింది ప్రత్యేక సహాయ ప్యాకేజీయే తప్ప రుణాలు కాదని పేర్కొన్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో తీవ్రంగా దెబ్బతిన్న వీధి వ్యాపారులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం జూన్‌ 1న పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని