నిన్న ఎమ్మెల్యే పదవికి.. నేడు పార్టీకి

తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సువేందు అధికారి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులకుంటున్నట్లు.....

Published : 17 Dec 2020 16:24 IST

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సువేందు అధికారి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దీనిబట్టి భాజపాలో చేరేందుకు ఆయన వేగంగా అడుగులు వేస్తున్నట్లు అర్థమవుతోంది.

మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీకి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పట్ల అసంతృప్తిగా ఉన్న సువేందు.. గత నెలలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఈ నెల 19న రాష్ట్ర పర్యటనకు రానున్న కేంద్ర హోంమంత్రి, భాజపా సీనియర్‌ నేత అమిత్‌ షా సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..
‘అధికారి’ లేకుండా దీదీ హ్యాట్రిక్‌ కొట్టగలరా?
తృణమూల్‌లో పెరుగుతోన్న అసమ్మతి..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని