భారత్‌ బయోటెక్‌ విజయవంతం కావాలి: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ దూరదృష్టితో చేపట్టిన ప్రాజెక్టు నేడు కరోనా వ్యాక్సిన్‌ తయారీలో కీలక భూమిక పోషిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు...

Published : 28 Nov 2020 00:31 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ దూరదృష్టితో చేపట్టిన ప్రాజెక్టు నేడు కరోనా వ్యాక్సిన్‌ తయారీలో కీలక భూమిక పోషిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. వ్యాక్సిన్‌ తయారీ ప్రక్రియలో దేశాన్ని ముందువరుసలో నిలిపిందని సంతోషం వ్యక్తం చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ రేపు హైదరాబాద్‌ జినోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించనున్న నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. తెదేపా ప్రభుత్వం అంకితభావంతో నిర్మించిన ప్రత్యేక పార్కు జినోమ్‌ వ్యాలీ అని.. దేశంలోని 150 లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో మొదటిదన్నారు. ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు ఈ పార్కు చక్కటి ఉదాహరణ అని చెప్పారు. జినోమ్‌ వ్యాలీలోని భారత్‌ బయోటెక్‌ దీన్ని రుజువు చేసిందని వెల్లడించారు. వ్యాక్సిన్‌ తయారీలో భారత్‌ బయోటెక్‌ నిపుణుల ప్రయత్నం విజయవంతం కావాలని చంద్రబాబు ఆకాక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని