మోదీ, అమిత్‌షా జోక్యం చేసుకోవాలి: జయదేవ్‌

ఏపీలోని దేవాలయాలపై దాడుల వ్యవహారంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కోరారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఏపీలో రెండు ప్రముఖ ...

Published : 22 Sep 2020 02:14 IST

దిల్లీ: ఏపీలోని దేవాలయాలపై దాడుల వ్యవహారంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జోక్యం చేసుకోవాలని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కోరారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ దేవాలయాలపై దాడుల అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఏపీలో రెండు ప్రముఖ దేవాలయాల్లోని రథాలను తగులబెట్టారని చెప్పడానికే చాలా బాధపడుతున్నాను. ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని ఈనెల 7న.. నెల్లూరు జిల్లాలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి రథానికి ఈ ఏడాది ఫిబ్రవరి 14న నిప్పు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆరు ఆలయాల్లోని 23 దేవతామూర్తుల విగ్రహాలను ఒక్కరోజులోనే ధ్వంసం చేశారు. ఈ ఘటనలపై ఇప్పటికి కనీసం కేసూ నమోదవలేదు.. ఎవర్నీ అరెస్టూ చేయలేదు. ఇంతకుముందు ఆస్తుల వేలం నిర్ణయం తీసుకున్న తితిదే.. ఆఖరికి వెనక్కి తగ్గక తప్పలేదు. ఆలయాలు, హిందువుల మనోభావాలపై ఈ రకమైన దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటనల్లో తక్షణమే జోక్యం చేసుకుని హిందువులకు న్యాయం చేయాలని ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కోరుతున్నా’ అని గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు