రాజధానిపై  కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో గళం విప్పారు. రాజధానిపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో గానీ, ఉమ్మడి జాబితాలో లేని రాజధాని తరహా అంశంలో తుది నిర్ణయం తీసుకొనే....

Published : 20 Sep 2020 00:46 IST

లోక్‌సభలో గళమెత్తిన తెదేపా ఎంపీ గల్లా 

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ లోక్‌సభలో గళం విప్పారు. రాజధానిపై కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో గానీ, ఉమ్మడి జాబితాలో గానీ లేని రాజధాని తరహా అంశంలో తుది నిర్ణయం తీసుకొనే అర్హత 248 అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని ఆయన లోక్‌సభ దృష్టికి తీసుకొచ్చారు. అమరావతి నిర్మాణానికి నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే నిధులిచ్చిందన్న ఆయన.. ఇప్పుడు తమకు సంబంధంలేదంటే ఆ సొమ్ములకు, ప్రజలకు జవాబుదారీ ఎవరని ప్రశ్నించారు. 

ఇతర రాష్ట్రాలూ ఇలా చేస్తే పరిస్థితేంటి?

రాజధాని అంశం కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలో ఎక్కడా లేకపోవడంతో గందరగోళం తలెత్తిందని పేర్కొన్నారు. ఈ తరహా అంశాల్లో తుది నిర్ణయం తీసుకొనేందుకు రాజ్యాంగంలోని 248 అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పారు. రాజధాని అంశాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంటే ఈ గందరగోళానికి తెరపడుతుందని సూచించారు. అలా చేయకపోతే ఏపీ ప్రభుత్వ విధానాన్ని ఇతర రాష్ట్రాలూ అనుసరించే అవకాశం ఉందని,  అప్పుడు అలాంటి నిర్ణయాల్లో కేంద్రం జోక్యం చేసుకోలేని పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని