సిక్కోలును విభజించవద్దు: రామ్మోహన్‌నాయుడు

కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 09 Nov 2020 02:04 IST

శ్రీకాకుళం: కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా శ్రీకాకుళం జిల్లాను విభజించవద్దని ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా విభజన వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 25 జిల్లాల ఏర్పాటు అసంబద్ధ ఆలోచనగా ఆయన అభిప్రాయపడ్డారు. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్ నియోజకవర్గాలు మారితే ఏం చేస్తారని రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో జరిగే కొత్త జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జిల్లాను విభజిస్తే తమ ప్రజల ఐక్యతను దెబ్బతీసినట్లేని.. ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. జిల్లాను విభజించవద్దని.. సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని ప్రభుత్వాన్ని రామ్మోహన్‌నాయుడు కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని