రెండో రోజూ తెదేపా సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇళ్ల స్థలాల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా తెదేపా

Published : 02 Dec 2020 01:36 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఇళ్ల స్థలాల అంశంపై జరిగిన చర్చ సందర్భంగా తెదేపా సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు బిల్లులు చెల్లించాలంటూ తెదేపా ఆందోళన కొనసాగించింది. ఈ క్రమంలో సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో తెదేపా సభ్యులను సస్పెండ్‌ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ను కోరారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మినహా 14 మంది తెదేపా సభ్యులను స్పీకర్‌ ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. సస్పెండ్‌ అయిన వారిలో కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్‌, చినరాజప్ప, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయ స్వామి, వేగుళ్ల జోగేశ్వరరావు, ఆదిరెడ్డి భవాని, గణబాబు, పయ్యావుల కేశవ్‌, గద్దె రామ్మోహన్‌, వెలగపూడి రామకృష్ణబాబు, మంతెనరామరాజు ఉన్నారు.

ఇవీ చదవండి..

మేం కట్టిన ఇళ్లకి మీ స్టిక్కరా?: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ.. రెండో రోజూ వాడీవేడి..!


 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని