తెలంగాణ శాసనసభ సమావేశాలు కుదింపు?

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సమావేశాలను కుదించాలన్న ప్రతిపాదన వచ్చింది.

Updated : 15 Sep 2020 15:55 IST

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు కుదించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సమావేశాలను కుదించాలన్న ప్రతిపాదన వచ్చింది. సోమవారం నాంపల్లి ఎమ్మెల్యే సహా అధికారులు, సిబ్బంది కలిపి సుమారు 52 మంది కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో శాసనసభాపక్ష నేతలతో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమావేశమయ్యారు. సమావేశాల కుదింపు విషయంపై చర్చించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా రేపటితో సమావేశాలను ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. మరికొన్నాళ్లు కొనసాగించాలని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం కోరింది. కృష్ణా జలాలు సహా పలు కీలక అంశాలపై చర్చ జరగాల్సి ఉన్నందున సమావేశాలు కొనసాగించాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ సమస్యలపై చర్చించాలని మజ్లిస్‌ కోరింది. దీనిపై స్పీకర్‌ పోచారం రేపు నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు