‘అపెక్స్‌ కమిటీ భేటీకి కేసీఆర్‌ సమయం ఇవ్వాలి’

నదీ జలాల వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకరిస్తున్నారని...

Published : 09 Aug 2020 05:41 IST

డిమాండ్‌ చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

హైదరాబాద్‌: నదీ జలాల వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎంకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నీటిని ఏపీకి తరలించే విషయంలో సీఎం కేసీఆర్‌ మౌనంగా ఉన్నారన్నారు. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు సీఎం వైఖరి వల్ల ఎడారిగా మారే అవకాశం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ లోపాయికారీగా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కట్టదలుచుకున్న ప్రాజెక్టులకు తెలంగాణ సర్కారు సహకరిస్తోందని విమర్శించారు. నీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి రాష్ట్ర భాజపా తరఫున లేఖలు రాశామని తెలిపారు. ఆగస్టు 12లోపు అపెక్స్‌ కమిటీ కౌన్సిల్‌ సమావేశానికి సీఎం సమయం ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి రాష్ట్ర భాజపా సిద్ధంగా ఉందని  బండి సంజయ్‌ ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని