ఎన్నికలపుడే రైతుబంధు గుర్తొస్తోంది: బండి

తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రైతులపై సీఎం కేసీఆర్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని

Updated : 10 Dec 2020 12:36 IST

జమ్మికుంట: తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రైతులపై సీఎం కేసీఆర్‌ కపట ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. భూసార పరీక్షలకు కేంద్రం రూ.125కోట్లు విడుదల చేసినా ఆ నిధులు ఎక్కడికెళ్లాయో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తెరాస నేతలు కృత్రిమ ఉద్యమం చేశారని ఆయన ఆరోపించారు. బంద్‌లో రైతులు ఎక్కడా పాల్గొనలేదన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పకుండా సీఎం కేసీఆర్‌ ముఖం చాటేస్తున్నారని సంజయ్‌ విమర్శించారు. కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే మాత్రమే రైతుబంధు గుర్తొస్తోందన్నారు. రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. సన్నరకం ధాన్యానికి రూ.2,500 ధర, రుణమాఫీ, రైతుబంధు తేదీలు ప్రకటించాలనే డిమాండ్లతో భాజపా కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని