హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు అతీగతీ లేదు:తలసాని

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ఉదయం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం...

Updated : 22 Sep 2020 18:44 IST

భట్టి - తలసాని మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వ్యవహారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ ఉదయం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల జాబితా తప్పుల తడకగా ఉందని.. లక్ష ఇళ్లు కట్టామంటూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని కూడా మీడియా సమావేశం నిర్వహించి ఆ విమర్శలను తిప్పి కొట్టారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల విషయంలో భట్టి విక్రమార్క మాటలు హాస్యాస్పదమన్నారు. నాంపల్లిలో తాము నిర్మించింది ఒక దగ్గర.. కాంగ్రెస్‌ నేతలు చూసింది మరో దగ్గరని చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మిస్తున్నాం.. మీకు జాబితా ఇచ్చాం..చూసుకోండి’’ అంటూ పరోక్షంగా భట్టిని ఉద్దేశించి అన్నారు. 

హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు అతీగతీ లేదని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి 150 మంది అభ్యర్థులు ఉన్నారా? అంటూ తలసాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై మాట్లాడేందుకు కాంగ్రెస్‌ నేతలకు అర్హత లేదని విమర్శించారు. పేదవాడికి రెండు పడక గదుల ఇళ్లు కట్టే రాష్ట్రం దేశంలోనే లేదన్నారు. కరోనా సమస్యలున్నా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని.. అది ఒక్కరోజులో పూర్తికాదని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో ఎక్కడ ఇళ్లు కడుతున్నామో తెలుసుకుని అక్కడికి వెళ్లాలని కాంగ్రెస్‌ నేతలకు తలసాని హితవు పలికారు. 

ఇదీ చదవండి..

అన్నీ దొంగ లెక్కలే : సీఎల్పీ నేత భట్టి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని