మీరేనా ‘సోనార్‌ బంగ్లా’ గురించి మాట్లాడేది?

నోబెల్‌ గ్రహీత, ప్రముఖ కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పుట్టిన ఈ రాష్ట్రం ఎప్పటికీ విద్వేషపూరిత రాజకీయాల్ని ఉపేక్షించదని.. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. స్వాతంత్రోద్యమ నాయకులను...

Updated : 30 Dec 2020 13:04 IST

కోల్‌కతా: నోబెల్‌ గ్రహీత, ప్రముఖ కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పుట్టిన ఈ రాష్ట్రం ఎప్పటికీ విద్వేషపూరిత రాజకీయాల్ని ఉపేక్షించదని.. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. స్వాతంత్రోద్యమ నాయకులను గౌరవించలేని వ్యక్తులు నేడు బంగారు బెంగాల్ ‌(సోనార్ బంగ్లా) గురించి మాట్లాడటం ఏంటని.. పరోక్షంగా భాజపాను ఉద్దేశిస్తూ ఆమె తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె బోల్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆమె విరుచుకుపడ్డారు. 

‘రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేలు టీఎంసీ పార్టీని వీడి బయటకు వెళ్లినంత మాత్రాన మాకేం సమస్య లేదు. ఎందుకంటే మాకు అండగా ప్రజలు ఉన్నారు. మీరు(భాజపా) కొంత మంది ఎమ్మెల్యేలను కొనొచ్చు. కానీ టీఎంసీ పార్టీని మాత్రం కొనలేరు. బెంగాల్‌ సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. విద్వేషపూరిత, విభజన రాజకీయాలు చేయడం ఆపాలి. జాతిపిత మహాత్మాగాంధీ సహా ఇతర స్వాతంత్ర్యోద్యమ నాయకులను గౌరవించలేని వారు కూడా ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి బంగారు బెంగాల్‌ (సోనార్‌ బంగ్లా) గురించి మాట్లాడుతున్నారు’ అని మమతా తీవ్రంగా విమర్శించారు. 

‘విశ్వభారతి వర్శిటీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు నాకు దిగ్బ్రాంతిని కలిగిస్తున్నాయి. విశ్వభారతి వర్శిటీలో విద్వేషపూరిత రాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వభారతి వర్శిటీ ఉపకులపతి విద్యుత్‌ చక్రవర్తి భాజపాకు చెందిన వ్యక్తి. ఆయన మతతత్వ రాజకీయాలతో వర్శిటీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారు. ’ అని దీదీ మండిపడ్డారు. 

ఇదీ చదవండి..

పార్టీపై రజనీకాంత్‌ సంచలన ప్రకటన


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని