వర్సిటీ నిర్మాణాల కూల్చివేతపై తెదేపా కన్నెర్ర

విశాఖ గీతం వర్సిటీ నిర్మాణాలను కూల్చివేయడంపై తెదేపా మండిపడింది. వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలతో రాష్ట్రాన్ని బలి చేస్తోందని విమర్శించింది. ..

Updated : 24 Oct 2020 13:55 IST

అమరావతి: విశాఖ గీతం వర్సిటీ నిర్మాణాలను కూల్చివేయడంపై తెదేపా మండిపడింది. వైకాపా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలతో రాష్ట్రాన్ని బలి చేస్తోందని విమర్శించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వంలో అభివృద్ధి లేదుగానీ, విధ్వంసం మాత్రం మెండుగా ఉందని మాజీ మంత్రి చినరాజప్ప ఎద్దేవా చేశారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దే వర్సిటీపై జగన్‌ కన్నుపడటం దురదృష్టకరమన్నారు.

గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్షసాధింపునకు పరాకాష్ట అని తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ విమర్శించారు. కరోనా కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులున్నా గీతం ఆస్పత్రి సేవలందించిందని గుర్తు చేశారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా యుద్ధవాతావరణం సృష్టించారన్నారు. మొన్న తెదేపా నేత సబ్బం హరి ఇల్లు, నేడు గీతం యూనివర్సిటినీ కూల్చారనీ, పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్‌ అని లోకేశ్‌ దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని