ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ: కోదండరాం

తెలంగాణ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విరించిందని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు...

Published : 06 Nov 2020 00:52 IST

హైదరాబాద్‌: తెలంగాణ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని.. ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం నడ్డి విరించిందని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు.నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రియల్‌ రంగం పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేసి రియల్ ఎస్టేట్ రంగాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ప్రైవేటు ఉద్యోగికి ఉచిత రేషన్‌తో పాటు రూ.7,500 నగదు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి రూ. 3,016 నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలన్నారు.‘‘రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. 

ఆన్‌లైన్ క్లాసుల ద్వారా అందరికీ విద్య అందడం లేదు. ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను ప్రకటించాలి. కళాశాలల మాదిరిగా పాఠశాల విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి. విద్యా సంవత్సరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి. వీలైతే రేపు విద్యాశాఖ కార్యదర్శిని కలుస్తాం’’ అని కోదండరాం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని