Published : 10 Aug 2021 10:38 IST

Madhyapradesh: శివుడే మా సీఎం.. కరోనాతో భయమేంటి?

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ వ్యాఖ్యలు

భోపాల్‌: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ‘శివుడు’, ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ‘విష్ణువు’ ఉన్నప్పుడు.. రాష్ట్రానికి కరోనా వైరస్‌ ఎలాంటి హానీ చేయలేదని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, భాజపా అధ్యక్షుడు విష్ణు దత్‌ను దేవుళ్లతో పోలుస్తూ ట్విటర్‌ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. డిసెంబరు నాటికి దేశంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలకు 135 కోట్ల టీకా డోసులు అందుతాయన్నారు.

అప్పుడు నిద్రపోయారా?

తరుణ్‌ చుగ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఘాటుగా స్పందించింది. పార్టీ కార్యకర్తల నుంచి ప్రశంసలు పొందేందుకు నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి భూపేంద్ర గుప్తా విమర్శించారు.‘‘మధ్యప్రదేశ్‌లో జనవరి-మే మధ్య 3.28 లక్షల మంది కరోనా కారణంగా కన్నుమూశారు. దేశవ్యాప్త మరణాల రేటు కంటే ఇది 24శాతం అధికం. కొవిడ్‌ ధాటికి 3,500 మంది భాజపా కార్యకర్తలు చనిపోయారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా చెప్పారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో శివరాజ్, విష్ణుదత్‌ ఎక్కడున్నారో చెప్పాలి. ఆ సమయంలో వారు నిద్రపోయారా? భవిష్యత్తులో కరోనాను వారు ఎలా కట్టడి చేస్తారని  భూపేంద్ర గుప్తా ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్