Chandrababu: ప్రతీకార దాడులే ప్రధాన అజెండాగా వైకాపా పాలన: చంద్రబాబు

ప్రతీకార దాడులే ప్రధాన అజెండాగా రాష్ట్రంలో వైకాపా పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అవినీతి, అఘాయిత్యాలు, అక్రమాలతో రాష్ట్రాన్ని

Published : 23 Sep 2021 01:54 IST

మంగళగిరి: ప్రతీకార దాడులే ప్రధాన అజెండాగా రాష్ట్రంలో వైకాపా పాలన సాగుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. అవినీతి, అఘాయిత్యాలు, అక్రమాలతో రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. బాధితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఎదురు కేసులు పెట్టడం దుర్మార్గమని ఆక్షేపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కొప్పర్రు ఘటన బాధితులు చంద్రబాబుతో సమావేశమయ్యారు. మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బత్తిన శారదను ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు.. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

అనంతరం శారద మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జగన్ ప్రభుత్వంలో బతకాలి అంటే భయమేస్తోంది. మా ఇంట్లో గంటన్నర పాటు విధ్వంసం సృష్టించారు. హత్యాయత్నం చేసిన వారిపై నామమాత్రపు బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. బాధితులైన తమపైనా కేసులు నమోదు చేశారు. తనకు న్యాయం జరగకపోతే ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హోం మంత్రే దాడులను ప్రోత్సహించడం అత్యంత దుర్మార్గం. అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలలకే నా భర్తను అరెస్టు చేశారు. వినాయకుడి ఊరేగింపు సాకుతో గత ఏడాది కూడా దాడికి పాల్పడి కారు అద్దాలు పగలగొట్టారు. ఈ సారి ముందస్తు ప్రణాళికతో పెట్రోలు సీసాలు, సిలిండర్ ట్రక్కులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. తెదేపాలో బలమైన నేతగా నా భర్త ఉన్నందుకే ఆయనపై కక్షకట్టారు. ఊరి కోసం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే మాపై దాడి చేశారు’’ అని శారద ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు