
By Election: హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది
దిల్లీ: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు పార్లమెంట్, 30 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని హుజూరాబాద్, బద్వేలు శాసనసభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. హుజురాబాద్, బద్వేలులో అక్టోబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు..
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏపీలోని బద్వేలులో వైకాపా ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య మృతిచెందడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. దీంతో ఈసీ అక్కడ కూడా ఉప ఎన్నిక నిర్వహించనుంది.
ముఖ్యమైన తేదీలివే..
ఎన్నికల నోటిఫికేషన్: అక్టోబర్ 1
నామినేషన్ల స్వీకరణ గడువు: అక్టోబర్ 8
నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 11
నామినేషన్ల ఉపసంహరణ: అక్టోబర్ 13
ఎన్నికల పోలింగ్: అక్టోబర్ 30
ఓట్ల లెక్కింపు: నవంబర్ 2
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.