Motkupalli: భాజపాకు మోత్కుపల్లి గుడ్‌బై.. బండి సంజయ్‌కు లేఖ

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భాజపాకు రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు.

Updated : 23 Jul 2021 16:53 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భాజపాకు రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు చెప్పారు. తన అనుభవాన్ని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం భాజపా కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగానూ అవకాశం ఇవ్వలేదని ఆక్షేపించారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకున్నపుడు తనకు ఒక్కమాట కూడా అడగకపోవడం ఇబ్బందికి గురిచేసిందన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలు తెలిజేయాల్సిందిగా ఆహ్వానిస్తే బండి సంజయ్‌కు చెప్పే వెళ్లానని.. అయినా పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం తనను బాధించిందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ మీద విశ్వాసంతోనే భాజపాకు రాజీమా చేసినట్లు ఆయన చెప్పారు. దళితబంధు సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో తెదేపా లేదని.. తన పాత మిత్రులంతా తెరాసకు మద్దతు పలకాలని ఆయన కోరారు. మోత్కుపల్లి త్వరలోనే తెరాసలో చేరే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని