TS news: కేంద్రం మోకాలడ్డుతోంది: నిరంజన్‌రెడ్డి

నదీ జలాల సమస్య తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం ఏకపక్షంగా గెజిట్‌ జారీ చేసిందని

Published : 19 Jul 2021 17:48 IST

హైదరాబాద్‌: నదీ జలాల సమస్య తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం ఏకపక్షంగా గెజిట్‌ జారీ చేసిందని మండిపడ్డారు. ఈ గెజిట్‌తో నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కేంద్రం తన పరిధిలోకి తీసుకోవడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ వల్లే తెలంగాణకు నదీ జలాల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం సాయం చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు తెరాస ప్రయత్నిస్తుంటే.. కేంద్రం మోకాలడ్డే ప్రయత్నం చేస్తోందని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని