కేసీఆర్‌ దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తి

తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం తెరాస అధినేత కేసీఆర్‌ 2009 నవంబర్‌ 29న నిరాహార దీక్ష ...

Published : 29 Nov 2020 11:56 IST

హైదరాబాద్‌: తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ చేపట్టిన దీక్షకు నేటితో 11 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం తెరాస అధినేత కేసీఆర్‌ 2009 నవంబర్‌ 29న నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్‌ చేసిన కృషికి నిదర్శనంగా ఏటా నవంబర్‌ 29న దీక్షా దివస్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌.. ట్విటర్‌ ద్వారా ప్రజలకు దీక్షా దివస్‌ శుభాకాంక్షలు తెలిపారు. దీక్షా దివస్‌ స్ఫూర్తిని, జ్హాపకాలు, పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ‘‘తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన అపూర్వ ఘట్టం. యావత తెలంగాణ ప్రజలను, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసిన దీక్ష’’ అంటూ భావోద్వేగ భరిత పోస్టు చేశారు. ఆ నాటి కేసీఆర్‌ ఫోటోలను సైతం ట్విటర్‌లో పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని