సిద్దిపేటకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌

సిద్దిపేటలో భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి బయల్దేరి అక్కడికి వెళ్లారు.

Published : 26 Oct 2020 20:07 IST

హైదరాబాద్‌: సిద్దిపేటలో భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి బయల్దేరి అక్కడికి వెళ్లారు. దుబ్బాక ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇంట్లో రెవెన్యూ, పోలీసు అధికారులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో భాజపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రఘునందన్‌ సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో కిషన్‌రెడ్డి సిద్దిపేట బయల్దేరి వెళ్లారు. 

మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన కరీంనగర్‌ నుంచి సిద్దిపేట చేరుకున్నారు. రఘునందన్‌ బంధువుల ఇళ్లపై దాడులు, సోదాలను ఖండిస్తు్న్నట్లు బండి సంజయ్‌ చెప్పారు. పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని.. సిద్దిపేటలో దాడులు, సోదాలు ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. భాజపా ముఖ్యనేతలు  జితేందర్‌రెడ్డి, వివేక్‌ కూడా సిద్దిపేట చేరుకున్నారు.

ఇదీ చదవండి..

రఘునందన్‌ బంధువుల ఇళ్లలో సోదాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని