దుబ్బాక ఉపఎన్నికలో గెలుపే ధ్యేయం: ఉత్తమ్‌

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు దృఢ సంకల్పం, క్రమశిక్షణతో పనిచేసి చరిత్ర సృష్టించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 11 Sep 2020 22:00 IST

మెదక్‌‌: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు దృఢ సంకల్పం, క్రమశిక్షణతో పనిచేసి చరిత్ర సృష్టించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని.. నిర్మాణాత్మకంగా పనిచేయాలని సూచించారు. ఉత్తమ్‌ నేతృత్వంలో శుక్రవారం ఇందిరా భవన్‌లో దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఎక్కడా కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. తెరాస ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించి అధికార పార్టీ నేతలను నిలదీయాలని సూచించారు. మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితులకు ఇస్తామన్న పరిహారం, రెండు పడకగదుల ఇళ్లు ఏమయ్యాయని ఉత్తమ్‌ ప్రశ్నించారు. గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్‌ సంస్థాగతంగా బలోపేతం కావాలని, అన్ని కమిటీలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డికి ఉత్తమ్‌ సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌, కుసుమ కుమార్‌, ఏఐసీసీ కార్యదర్శులు వంశీ చంద్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, బలరాం నాయక్‌, దుబ్బాక స్థానిక నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని