డీజీపీ దగ్గరున్న సాక్ష్యాలేంటి?: వర్ల

తెదేపా అధినేత చంద్రబాబుకు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ రాసిన లేఖకు ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రత్యుత్తరం రాశారు. డీజీపీ రాసిన లేఖ అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 ...

Published : 01 Oct 2020 12:21 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుకు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ రాసిన లేఖకు ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రత్యుత్తరం రాశారు. డీజీపీ రాసిన లేఖ అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19 సబ్‌సెక్షన్‌ 1A స్ఫూర్తికి డీజీపీ రాసిన లేఖ పూర్తి వ్యతిరేఖమని పేర్కొన్నారు. అంతర్వేది స్వామివారి రథాన్ని తగులబెట్టింది చంద్రబాబే అని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపిస్తే సాక్ష్యాలు కోరుతూ ఆయనకు ఎందుకు లేఖ రాయలేదని వర్ల నిలదీశారు. చంద్రబాబును మంత్రి కొడాలి నాని బూతులు తిడితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రామచంద్రపై దాడికేసులో ముద్దాయి ప్రతాప్‌రెడ్డి తెదేపాకు చెందిన వాడని చెప్పడానికి డీజీపీ దగ్గర ఉన్న సాక్ష్యాలేంటని ప్రశ్నించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని